Trending Now

గడీల పాలన కాదు.. కాంగ్రెస్ పాలన చూడండి

మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు..

ప్రతిపక్షం, గజ్వేల్ మే 7: గతంలో గడీల పాలనను చూశారు.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను చూడండి అని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. గత పాలనలో స్వేచ్చ లేకుండా పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వర్గల్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ఈ దేశంలో పేదల కోసం ఆలోచించేది ఏకైక కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిలబడుతుందని చెప్పారు. గత పాలకులు ఈ పదేళ్లలో కనీసం భూములు, రేషన్ కార్డులైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఆదానీ, అంబానీలో కోసం పనిచేస్తుందని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే యువతకు లక్షలాది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పారు. తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే మెదక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా ఇన్చార్జి తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం కార్యకర్తలంతా శ్రమించాలని సూచించారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కష్టపడిన కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

దుమ్మురేపిన.. నీలం ప్రచారం..

ములుగు నుంచి వర్గల్ వరకు భారీ ర్యాలీ, రోడ్ షో..

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నిర్వహించిన ఎన్నికల ప్రచారం దుమ్ము రేపింది. ములుగు నుంచి వర్గల్ మండలానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అలాగే మండలం కేంద్రంలోని పలు సెంటర్ల మీదుగా బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచార రథంలో సిద్దిపేట జిల్లా ఇన్చార్జి తూముకుంట నర్సారెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు వివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. ఎలక్షన్ ఇంచార్జ్ సురేందర్ ముదిరాజ్, ఆంక్ష, రాజశేఖర్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూమన్న, ప్రభు, ప్రదీప్, సందీప్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News