Trending Now

సీఎం మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు

రుణ మాఫీ కాంగ్రెస్ గ్యారంటీ..

దుబ్బాక అభివృద్ధి కోసం శ్రీనివాస్ రెడ్డి కి అండగా ఉంటా..

దుబ్బాక రోడ్ షో లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక రోడ్ షో లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో కి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హబ్సిపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రోడ్ షో దుబ్బాక పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, వ్యాపారులారా.. మీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను. గతంలో ఏం అభివృద్ధి జరిగింది.. రేపు ఏమి అభివృద్ధి జరగాలో చర్చిద్దాం. వ్యాపారులూ మీరు ఆలోచన చేయండి.. చర్చ చేయండి. 20 ఏళ్ల కిందట అందరూ సంగారెడ్డిలో జడ్పీకి వచ్చేటోళ్లు. ఆ రోజుల్లో కేసీఆర్ కి, ముత్యంరెడ్డికి కొట్లాట నడుస్తుండేది. నిధులన్నీ దుబ్బాకకే తీసుకుపోతున్నడని అనేవాళ్ళు. రాష్టంలో వున్న నిధులన్నీ దుబ్బాక పోతున్నాయని చర్చ జరిగేది. ఒక సందర్బంగా చంద్రబాబు కూడా ముత్యంరెడ్డితో అన్నారు. నిధులు అన్నీ దుబ్బాక కి తీసుకపోతున్నావని అన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా రోడ్లు లేకున్నా, స్కూళ్లు లేకున్నా.. దుబ్బాకలో ముత్యంరెడ్డి మంచి రోడ్లు వేయించారు. స్కూళ్లు కట్టించారు. అలాంటి ముత్యంరెడ్డి కొడుకుని ఓడగొట్టుకుంటారా..? సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.. రుణమాఫీ 2లక్షలు ఒకే సారి మాఫీ చేస్తామన్నరు. దైవసాక్షిగా మాట ఇచ్చారు. గతంలో రెండుసార్లు కేసీఆర్ రుణమాఫీ పేరిట మోసం చేశారు. మొన్ననే రుణమాఫీ అయిపోవు. కేసీఆర్ వున్న పైసలు అన్నీ నాకి పారేసిండు. ప్రభుత్వం వద్ద పైసలు లేవు. కేసీఆర్ అడుగు కూడా మిగల్చకుండా గీకి, నాకి, దివాళా తీయించి దిగిపోయిండని జగ్గారెడ్డి ఫైరయ్యారు.

కేసీఆర్ ఈ రోజు హ్యాపీ గా ఉన్నారు. అప్పులు చేసిన.. అక్కడ ఏమీ లేదు.. కాంగ్రెస్ వాళ్లు కొట్టుకుంటారు అని అనుకుంటున్నారు. డబ్బులు లేకనే రుణ మాఫీ మూడు నెలలు ఆలస్యం అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాటనిలబెట్టుకుంటారు. నేను కూడా మాట ఇస్తున్నా. August 15లోగా రుణమాఫీ అవుతుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి పదేళ్లు ఎంపీ వున్నా బీడీ కార్మికులను ఆదుకోలే.. ఆయనకు మళ్లీ ఎందుకు ఓటేసిర్రు. ఇట్లా అయితే ఎట్ల మీ బతుకులు బాగు పడతాయి. అయిదేళ్ల దాకా ఎవరు మిమల్ని పట్టించుకుంటారు. జగ్గారెడ్డిగా మాటిస్తున్న. రాహుల్ గాంధీ ప్రధాని అయితారు. సీఎంతో రేవంత్ తోనూ మాట్లాడతా.. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా నేను ప్రయత్నం చేస్తానన్నారు. ఈ అయిదేళ్లు దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినా.. ఏ పని అయినా శ్రీనివాస్ రెడ్డి చేయాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయలేడు. దుబ్బాక నుంచి 50వేల మెజారిటీ ఇవ్వండి. మేం జవాబుదారీగా ఉంటాం. జగ్గారెడ్డి మాట ఇస్తే తప్పక పని అయితది.

మీరు 50వేల మెజారిటీ ఇస్తే.. శ్రీనివాస్ రెడ్డి పనులు కావాలని సీఎంని అడగగలరు. నేను ఆయన పక్కన వుంటాను. ఎంపీగా నీలం మధును గెలిపించండి. మన దగ్గర డబ్బులు లేవు. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు వున్నాయి. అందుకే ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేయండి. రఘునందన్ రావు కనీసం కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా నిధులు తెచ్చారా? ఆలోచన చేయండి. ఫోన్ ట్యాపింగ్ అందరికీ తెలుసు కదా.. రాధా కిషన్ రావు.. 9ఏళ్ళు మనతో ఆడుకున్నారు. ఇప్పుడు ఏంది పరిస్థితి. పోలీస్ డ్రెస్ వేసుకొని.. అరాచకాలు చేస్తే.. కాంగ్రెస్ వాళ్ళను అరెస్టులు చేస్తే.. ఇప్పుడు అలాంటి పోలీసులను కూడా పోలీసులే అరెస్ట్ చేశారు.

Spread the love

Related News