Trending Now

IPL 2024 : నేడు బెంగళూరు‌తో సన్‌రైజర్స్ ‘ఢీ’

సొంతగడ్డపై ఫెవరేట్‌గా హైదరాబాద్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPLలో ఇవాళ హైదరాబాద్ వేదికగా SRH-RCB మ్యాచ్ జరగనుంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోన్న SRHపైనే అందరి దృష్టి ఉంది. ఇవాళ గెలిస్తే ఆరెంజ్ టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానానికి చేరనుంది. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ ఛాన్స్ కోల్పోయిన RCB.. ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటోంది. ఈ సీజన్‌లో మూడు సార్లు 250+ స్కోర్లు చేసిన SRH ఇవాళ 300+ స్కోర్ చేస్తుందేమో వేచి చూడాలి.

ఊహకు కూడా అందని విధ్వంసంతో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోతుంది. హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులను వణికిపోయేలా చేస్తుంది. ఒక మ్యాచ్‌కు మించి మరో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న హైదరాబాద్ సొంత గడ్డపై గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి వేదికలపై బౌలర్లను ఆడుకున్న హైదరాబాద్ సొంత ఇలాకాలో ఎంతటి విధ్వంసం సృష్టించనుందనేది ఆసక్తికరం. ఇదే సీజన్‌లో బెంగళూరుపై అత్యధిక స్కోరు (287) నమోదు చేసిన హైదరాబాద ఉప్పల్‌లో ఆ రికార్డును బద్దులు కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. పసలేని బెంగళూరు బౌలర్లను చితక్కొట్టాలని కంకణం కట్టుకుంది. హైదరాబాద్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. బెంగళూరు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది.

పేలవంగా బెంగళూరు..

మరోవైపు బెంగళూరు జట్టు విజయం కోసం ఎదురుచూస్తోంది. సీజన్‌లో వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో పరాజయం పాలవుతూ.. ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు కోల్పోయిన ఆ జట్టు మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన బెంగళూరు దురదృష్టం కూడా వెక్కిరిస్తుంది. బ్యాటింగ్ విభాగం పర్లేదనిపిస్తున్నప్పటికి బౌలింగ్ విభాగం మాత్రం మరింత పేలవంగా తయారైంది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ మినహా అందరూ పెద్దగగా ఆకట్టుకోవడం లేదు. ఇక ఫినిషర్‌గా దినేష్ కార్తిక్ అదరగొడుతున్నాడు. బౌలింగ్‌లో మాత్రం పెద్దగా మెరుపుల్లేవు. వికెట్లు తీయడం కంటే పరుగులు సమర్పించుకోవడంలో బెంగళూరు బౌలర్లు పోటీ పడుతున్నారు. సిరాజ్, యష్ దయాల్, ఫెర్గూషన్, గ్రీన్, కర్ణ్ శర్మ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు విజయం చాలా అవసరం. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్న బెంగళూరు.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓడిపోతే ఈ సీజన్ నుంచి ఇంటికి వెళ్లే తొలి జట్టుగా నిలవనుంది.

Spread the love

Related News