Trending Now

పోలీస్ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 14 : నిర్మల్ జిల్లాలోని రూరల్ మండలం ఎల్లాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా పోలీస్ అధికారి కార్యాలయ స్థలాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నంబర్ 459 లో గల స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించడంతోపాటు దానికి సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించి అనంతరం పలు సలహా సూచనలు చేశారు. అయన తో పాటు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నా కళ్యాణి, నిర్మల్ రూరల్ తహశీల్దార్ రాజు తదితరులు ఉన్నారు.

Spread the love

Related News