Trending Now

సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..

ప్రతిపక్షం, హైదరాబాద్: ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో హైదరాబాద్ – బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వాహనం వెనక నుంచి ఢీ కొట్టింది. కారులో మంగ్లీతో పాటు మేఘరాజ్, మనోహర్‌ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురికీ స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News