ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. బుధవారం రాత్రి రాష్ట్ర మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేరుగా గాంధీ భవన్ కు చేరుకొని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయం నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో అల్లోల అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలోని ఈద్గా, నర్సాపూర్ (జి)మండల కేంద్రాలలో అల్లోల అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుంటూ రాత్రి నినాదాలు చేశారు.