ప్రతిపక్షం, జూన్ 17: అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఇంజినీర్ సాయి కార్తీక్ మృతిచెందారు. ఆయన కుటుంబం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందినదిగా, అనంతరం కర్నూలు జిల్లా తుమ్మిగనూరులో స్థిరపడినట్లు సమాచారం.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సాయి కార్తీక్ అక్కడే ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. స్కైడైవింగ్ కోసం వెళ్లిన సమయంలో ప్రయాణిస్తున్న చిన్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

















