ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: 53 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం SOT రాజేంద్రనగర్ టీం, KPHB పోలీసులు కూకట్ పల్లి లోని వసంత్ నగర్ బస్ స్టాప్ అనుమానాస్పదంగా రెండు హీరో ప్యాషన్ ప్రో బైక్‌ల పై (TS 08 FY 5401 & TS 08 FY 5402) వచ్చిన వ్యక్తులను పట్టుకుని వారిని సోదా చేయగా.. అందులో ఒకరి వద్ద గల బ్లాక్ కలర్ కాలేజీ బ్యాగ్ లో రూ. 53,37,500/- లు లభ్యమయ్యాయి. హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ సంస్థ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న నాగరాజు, అకౌంటెంట్ గా పనిచేస్తున్న ముసల నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు వారి యజమాని గౌరీ శంకర్ ఆదేశాల మేరకు బహదూర్‌పురా లో ఒక వ్యక్తి నుండి రూ. 53,37,500/- మొత్తాన్ని తీసుకుని కూకట్ పల్లి లోని వసంత్ నగర్ లో గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ కు చెరవేస్తున్న క్రమంలో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు బైక్ లను ఉపయోగిస్తూ, ఎవరికి అనుమానం రాకుండా కాలేజ్ విద్యార్థులు ఉపయోగించే షోల్డర్ బ్యాగ్ లో డబ్బును అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టుబడిన వారిలో చిలువిరి నాగరాజు (గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ సంస్థ లో సేల్స్ మేనేజర్), రౌతు ముసల నాయుడు, (Occ గౌరీ శంకర్ రియల్ ఎస్టేట్ సంస్థలో అకౌంటెంట్) గా పోలీసులు గుర్తించారు. దీంతో కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.