New Zealand third test cricket match against India: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తడబడుతోంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్.. ఆరో ఓవరల్లోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(18) హెన్నీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి రోజు పూర్తయ్యే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. దీంతో భారత్.. ఇంకా 149 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (31), పంత్ (1) క్రీజ్‌లో ఉన్నారు. యశస్వీ జైశ్వాల్(30), విరాట్ (4) నిరాశపరిచారు. అజాజ్ పటేల్ 2, మ్యాట్ హెన్రీ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ స్పిన్ మాయాజాలానికి కివీస్ బ్యాటర్లు బోల్తా పడ్డారు. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టడి చేశారు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైన నాలుగో ఓవర్‌లోనే ఆకాశ్ దీప్ వికెట్ తీశాడు. కాన్వే (4) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తర్వాత తొలిసెషన్ పూర్తయ్యే సరికి కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. సుందర్ బౌలింగ్‌లో లాథమ్, రవీంద్ర క్లీన్ బౌల్డ్ అయ్యారు. యంగ్(71), మిచెల్(82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో కివీస్ 65.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, ఆకాశ్ వికెట్ తీశారు.