తెలంగాణలోనూ కూటమి రాజకీయాలకు అవకాశం?

ప్రతిపక్షం, జూన్ 03: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు తెలంగాణలోనూ కూటమిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తానని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేశ్ ఇటీవల మహానాడు సభలో ప్రకటించారు. త్వరలో రాష్ట్రంలోని నాయకులతో సమావేశమవుతానని కూడా ఆయన తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే కూటమి అంశంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం రాజకీయ ఊహాగానాలకు దారితీసింది.

ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలంగాణ రాజకీయ పరిణామాలపై సానుకూల సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మూడు పార్టీల మధ్య భవిష్యత్తులో ఎన్నికల పొత్తు ఏర్పడే అవకాశాలపై చర్చ మరింత వేడెక్కింది.

Spread the love

Related News

Latest News