సార్వత్రిక దూర విద్యా విధానంలో ప్రవేశాలు ప్రారంభం..

ప్రతిపక్షం చేర్యాల, జులై 3: చదువు మధ్యలో ఆపేసిన వారికి, ఎలాంటి అవాంతరాలు ఏర్పడినప్పటికీ చదువు మళ్లీ కొనసాగించడానికి 14 సంవత్సరాలు నిండిన అన్ని వర్గాల వారికి పై చదువులు చదవలేమని నిరుత్సాహపడే యువతి యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, పలు వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నవారికి విద్యారంగంలో సంపూర్ణ పరిజ్ఞానాన్ని సముపార్జించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నా యువతకు సార్వత్రిక దూరవిద్య విధానం ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికి ZPHS పెద్దమ్మగడ్డ చేర్యాల తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. విద్యార్హత పెంపొందించుకోవడానికే కాక ఉద్యోగం ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారు డిగ్రీ, పీజీ, బీటెక్ ఉన్నత చదువులకు కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ అందిస్తున్న సర్టిఫికెట్స్ గేట్వే మాదిరిగా ఉపయోగపడతాయని ZPHS పెద్దమ్మగడ్డ చేర్యాల ప్రధానోపాధ్యాయులు, AI కోఆర్డినేటర్ వి సురేష్ కుమార్ తెలిపారు.ఈ సార్వత్రిక దూర విద్యా విధానంలో SSC లేదా ఇంటర్మీడియట్ సింగిల్ సీటింగ్ ద్వారా ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని ఈ సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యలో సంపాదించిన సర్టిఫికెట్ కు సమానమని అభ్యాసకులు గుర్తుంచుకోవాలి. సార్వత్రిక విద్య ద్వారా ఉజ్వల భవిష్యత్తును అందిపుచ్చుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యాసకుల ప్రవేశాల నిమిత్తం 2026-27 విద్యా సంవత్సరమునకు షెడ్యూల్ విడుదలైనది కాబట్టి అడ్మిషన్ పొందగోరు అభ్యర్థులు జూలై 28 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్ పొందడానికి నేరుగా ZPHS పెద్దమ్మగడ్డ చేర్యాల అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి గాని, 9949106117, 9666274952 ఫోన్ నెంబర్ల ద్వారా గాని వివరాలు తెలుసుకొని అవసరమైన ధ్రువపత్రాన్ని కార్యాలయంలో అందజేసి అడ్మిషన్ పొందవచ్చని పాఠశాల AI కోఆర్డినేటర్ తెలిపారు.

Spread the love

Related News

Latest News