ముగ్గు వేస్తున్న మహిళను అసభ్యంగా తాకి.. పరార్

ప్రతిపక్షం, జూన్ 18: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను ఓ గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా తాకి పరారైన ఘటన కలకలం రేపింది. పల్సర్ బైక్‌పై వచ్చిన నిందితుడు వెనుక నుంచి వచ్చి మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితురాలు కేకలు వేయడంతో ఆమెను తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Spread the love

Related News

Latest News