Trending Now

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్నినంటిన హోలీ సంబరాలు..

ప్రతి పక్షం, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లా పోలీస్ కార్యాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నినంటాయి. పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని.. సిబ్బందితో కలిసి హోలీ వేడుకను జరుపుకున్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనే ఈ హోలీ పండుగను అందరు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని సూచించారు.

ఈ హోలీ రంగులు మీ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నానని, హోలీ వేడుకలు జరుపుకునేటప్పుడు కలర్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా డే అండ్ నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా చేయడం జరుగుతుందన్నారు. అన్ని మతాలకు చెందిన పండగలు ఏకకాలంలో రావడంతో జిల్లాప్రజలు ఒకరి మత సాంప్రదాయాలను ఒకరు గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్, సంగారెడ్డి డీయస్పీ సత్యయ్య గౌడ్, పట్టణ ఇన్స్పెక్టర్ యన్. భాస్కర్, ఆర్.ఐ. రాజశేఖర్ రెడ్డి, యస్.బి. ఎస్ఐ. యాదవరెడ్డి, ఆర్.ఎస్ఐ. మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొనారు.

Spread the love