Trending Now

కవిత అరెస్టు.. ఈడీ ప్రకటనను ఖండించిన ఆప్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ED విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఈడీ విడుదల చేసిన ప్రకటనపై ఆప్‌ స్పందించింది. ఈడీ భారతీయ జనతా పార్టీ విభాగంలా పనిచేస్తోందని ఆప్‌ నేతలు ఫైరయ్యారు. తమ పార్టీ నేతలకు కవిత రూ.100 కోట్లకుపైగా ముడుపులు చెల్లించారని ఈడీ ఎలా ప్రకటన చేస్తుందని మండిపడ్డారు. ఈడీ తటస్థంగా వ్యవహరించాల్సిందిపోయి బీజేపీ విభాగంలా తయారై.. తప్పుడు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు.

తమ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాల ప్రతిష్ట దెబ్బతీయడానికే ఈడీ తప్పుడు ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని ఆప్‌ నేతలు గుర్తు చేశారు. ఈ దర్యాప్తు సంస్థ బీజేపీ పొలిటికల్‌ వింగ్‌లా పనిచేస్తోందని మండిపడింది. గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసిందని, ఈ కేసులో దర్యాప్తు సంస్థకు ఒక్క రూపాయి కూడా లభించలేదని తెలిపింది.

Spread the love