Trending Now

‘వారు తీవ్రంగా నష్టపోతున్నారు’.. వ్యవసాయ శాఖ మంత్రికి ట్విట్టర్ లో హరీష్ రావు సూచన

ప్రతిపక్షం, తెలంగాణ: సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సన్ ఫ్లవర్ రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా.. మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రతి క్వింటాలుకు దాదాపు రూ. 2 వేలు నష్టపోతున్నారని తెలిపారు. గతంలో మా ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి సన్‌ఫ్లవర్ కొని రైతులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. మీరు వెంటనే అధికారులను ఆదేశించి రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధరకు సన్‌ఫ్లవర్ కొని, రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాని టీట్టర్ లో హరీష్ రావు కోరారు.

Spread the love