టీడీపీ- జనసేన తొలి లిస్ట్ పై సజ్జల హాట్ కామెంట్స్
ప్రతిపక్షం, ఏపీ: టీడీపీ- జనసేన సీట్లను ప్రకటించడంపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు వ్యూహాల్లో పవన్ బలవుతున్నారని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు. పవన్ ను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. రాజకీయ పార్టీని నడిపే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేన పోటీ చేసే 24 సీట్లల్లో కూడా ఉన్నది చంద్రబాబు అభ్యర్థులే అని పేర్కొన్నారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని సీట్లల్లో పోటీ చేసిన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. అప్పనంగా వచ్చిన జనసేనను చంద్రబాబు మింగేశాడు. ఎక్కడ పోటీ చెయ్యాలో పవన్ నిర్ణయించుకోలేక పోతున్నాడా..? చంద్రబాబుకు ఎందుకు సపోర్టు చేస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు ఇచ్చిన జాబితాలో పవన్ పేరే లేదు. పవన్ ని చూస్తే జాలేస్తుంది. పవన్ కంటే ఎక్కువ పవన్ అభిమానులను చూస్తేనే జాలేస్తుందని ఎదేవా చేశారు. బీజేపీ తో పొత్తుకు చంద్రబాబు ఆరాట పడుతున్నాడని.. పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందంటూ కామెంట్స్ చేశారు.