ప్రతిపక్షం, ఏపీ: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవాళ విడుదల చేశారు. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. టీడీపీ-జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ఖరారు అయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనుండగా.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండే మరోసారి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. బీజేపీతో పొత్తు, సీట్లు సర్ధుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.