సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు..
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2024 ఇవాళ విడుదల అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల అనంతరం సప్లిమెంటరీ పరీక్షా తేదీలను కూడా ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నది.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల హవా..
ఏపీ ఇంటర్ 2024 ఫలితాలో ఫస్ట్ ఇయర్‌లో అబ్బాయిలు 64 శాతం, అమ్మాయిలు 71 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్‌లో అబ్బాయిలు 75 శాతం, అమ్మాయిలు 81 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక ఒకేషన్‌లోనూ అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ 70 శాతం, సెకండ్ ఇయర్ 80 శాతం ఉత్తీర్ణతతో విజయ దుందుభి మోగించారు. అబ్బాయిలు ఫస్ట్ ఇయర్ 47 శాతం, సెకండ్ ఇయర్ 59 శాతం ఉత్తీర్ణత పొందారు.