Trending Now

సమాజ నిర్మాణంలో బిషప్‌ తుమ్మబాల ఎనలేని సేవలు అందించారు : సీఎం రేవంత్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మాజీ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల(80) అనారోగ్యంతో గురువారం కన్ను మూశారు. ఈయన వరంగల్‌ బిష్‌పగా 25 ఏళ్ల పాటు పనిచేశారు. విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్‌లో తుమ్మబాల పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని.. ‘శాంతి మతసామరస్యం, విద్యను వారు ప్రజలకు అందించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది’ అని సీఎం రేవంత్ తెలిపారు.

Spread the love

Related News

Latest News