ప్రతిపక్షం, తెలంగాణ: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఔన్నత్యాన్ని చాటారు. తన మొదటి నెల వేతనాన్ని షాద్ నగర్ తాలూకా రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షనర్స్ సంఘానికి ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే శనివారం ఉదయం సదరు సంఘం నాయకులు సరాపు జగదీశ్వర్, రామారావు, జనార్ధన్ తదితరుల చేతుల మీదుగా 1,50,000 చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలిచిన తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున తనకు సన్మానం చేసిన రోజు సంఘం కష్ట, నష్టాలను వినడం జరిగిందని, వెంటనే వారికి తన వేతనంలో డబ్బు ఇస్తానని చెప్పినట్టు గుర్తు చేశారు. సంక్షేమ సంఘానికి తన వంతు కృషిగా డబ్బులు అందజేస్తున్నట్టు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ను ఉద్యోగులు అభినందించి సన్మానించారు.