Trending Now

‘మతి భ్రమించి మాట్లాడుతున్నారు’.. బీజేపీపై కాంగ్రెస్ నేత ఫైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని TPCC సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీకి పూరీ జగన్నాథ్ భక్తుడు అని మాట్లాడటం తెలంగాణ కాంగ్రెస్ ఖండిస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పూరీ జగన్నాథ్ భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. అనంతరం ఆయన క్షమాపణలు చెప్పి మూడు రోజులు ఉపవాస దీక్ష చేస్తాం అని చెప్పడం తప్పుదోవ పట్టించేందుకే.. పూరీ జగన్నాథ్ భక్తుల ఆగ్రహానికి బీజేపీ గురికాక తప్పదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో కృష్ణుడిలా, రాముడి లా మోడీ భగవత్ స్వరూపం అని చెప్పిన ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మూడవ సారి బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశ వ్యాప్తంగా మోడీ పేరిట ఆలయాలను నిర్మించి.. దర్శనాలకు వెళ్లాలని చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తారు. మహాత్మా గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు విడుదల ఎన్నికల పోలింగ్ లో బీజేపీ కి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల పోలింగ్ లో కూడా మోడీ కి కనువిప్పు కలిగేలా ఉంటాయన్నారు.

Spread the love

Related News

Latest News