Trending Now

హైదరాబాద్ లో భారీగా నగదు స్వాధీనం..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: హైదరాబాద్​జిల్లాలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఇప్పటివరకు రూ.1,73,60,800/- నగదును, రూ.23,61,964/- విలువైన ఇతర వస్తువులు, 314.45 లీటర్ల అక్రమ మద్యన్ని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి శనివారం ఉదయం ఆరు గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.87,69,000/- నగదుతో పాటు రూ.4,55,875/- విలువ గల ఇతర వస్తువులు, 94.05 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు  రూ.97,29,000/-, పోలీస్ అధికారులు రూ. 74,81,800/-, స్టాటిస్టిక్స్ సర్వే లైన్స్ టీమ్ రూ.1,50,000/- నగదు జప్తు చేశారని, రూ.23,61,964/- విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 31 మంది పై ప్రోహిబిషన్ కేసులు నమోదు చేసి, 32 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగదు, ఇతర వస్తువుల పై 57  ఫిర్యాదులు అందగా పరిశీలించి పరిష్కరించారని, 40 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసినట్లు రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.

Spread the love