ప్రతిపక్షం, సిద్దిపేట, మే 06: దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. శంకర్ తండ్రి పెద్దలింగని రాజయ్య మరణించిన సమాచారం తెలుసుకొని హరీష్ రావు లింగుపల్లి కి వచ్చి రాజయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ ఆభ్యర్ధి వెంకట్రామ్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, బీఅర్‌ఎస్ నాయకులు మనొహర్ రావు, రాధక్రిష్ణ శర్మ, మదాసు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.