ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పీఎస్ పరిధిలోని మార్కండేయ నగర్, గాజుల రామారం రోడ్, రోడా మేస్త్రీ నగర్, షాపూర్‌నగర్‌లో ఎస్ఓటి మేడ్చల్ టీమ్ కు అందిన నిర్ధిష్టమైన సమాచారం మేరకు పాత నేరస్తుడైన బానోత్ సాయి కుమార్ ని పట్టుకున్నారు. అతని వద్ద 5 కేజీల గంజాయి శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఒక పాత నేరస్థుడు ఇండ్లలో దొంగతనాలు చేయడం, గంజాయికి అలవాటు పడి పెడ్లర్ గా అవతారం ఎత్తాడు.