ప్రతిపక్షం, జూన్ 04: హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని కేఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టాయ్స్ దుకాణంలో ప్రారంభమైన మంటలు వేగంగా ఇతర దుకాణాలకు వ్యాపించడంతో వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్లాస్టిక్ వస్తువులు అధికంగా ఉండటంతో మంటలు తీవ్రరూపం దాల్చగా, దట్టమైన పొగతో మైత్రివనం పరిసరాలు కమ్ముకున్నాయి. ఘటనతో అమీర్‌పేట జంక్షన్, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

















