జులై 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట పర్యటన

  • ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
  • కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవo
  • ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్. ఆదర్శ్ సురభి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి సమీక్ష సమావేశం

ప్రతిపక్షం, జులై 13, వనపర్తి ప్రతినిధి: జులై 15న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.ముఖ్యమంత్రి కొత్తకోట పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డితో కలిసి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారని తెలిపారు.కార్యక్రమం జరిగే ప్రాంగణంలో బారికేడ్లు, వేదిక, సౌండ్ సిస్టమ్, విద్యుత్, తాగునీరు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి విద్యార్థులతో నిర్వహించే ముఖాముఖి సంభాషణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సాంకేతిక ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని తెలిపారు.కార్యక్రమానికి హాజరయ్యే 9, 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూర్చునే ఏర్పాట్లు, కార్పెట్లు, తరగతి గదుల్లో ఫర్నిచర్, తాగునీరు, అల్పాహారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.విద్యార్థుల రాకపోకలు, వారి నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించి, కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమం సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి:జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి

జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి పోలీసు బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, వీఐపీ రూట్, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.అనంతరం సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిపాడ్ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. బారికేడ్ల విషయంపై ఆర్ అండ్ బి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సమీక్ష సమావేశంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జెడ్పి సీఈవో యాదయ్య, ఆర్ అండ్ బి అధికారి దేశ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News