ప్రతిపక్షం, జూలై 03: రాష్ట్ర అప్పుల అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి సవాల్ విసిరారు. జూపల్లి విడుదల చేసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.77 లక్షల కోట్లు అని ఉందని, అయితే రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం అది రూ.1.86 లక్షల కోట్లుగా నమోదైందని పేర్కొన్నారు.
అదే సమయంలో ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ గణాంకాల్లోనే వైరుధ్యాలు ఉన్నాయని ఆరోపించారు.
తాము చెప్పిన లెక్కలు తప్పని నిరూపితమైతే మంత్రి జూపల్లి తన పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమాధానం చెప్పకుండా ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

















