యూరియా పంపిణీలో కొత్త విధానం విజయవంతం.. దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం ఆసక్తి: తుమ్మల

ప్రతిపక్షం, జూన్ 26: యూరియా పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌పై జరుగుతున్న విమర్శలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

గతంలో సాగు చేయని వ్యక్తులు కూడా యూరియా కొనుగోలు చేయడం, ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం వంటి అక్రమాలు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం యాప్‌ ఆధారిత విధానం అమల్లోకి రావడంతో అర్హులైన రైతులకు మాత్రమే యూరియా అందుతోందని, పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించిందని తుమ్మల పేర్కొన్నారు. ఈ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన యూరియా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News