సింగరేణిపై కేంద్ర పెత్తనం తొలగించాలి: కవిత

ప్రతిపక్షం, జూన్ 15: సింగరేణి సంస్థపై కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని తొలగించి రాష్ట్రానికి పూర్తి హక్కులు కల్పించాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. గుజరాత్ తరహాలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఖనిజ వనరుల నిర్వహణ బాధ్యతలను దానికి అప్పగించాలని సూచించారు.

సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమంలో మాట్లాడిన కవిత, రాష్ట్రంలోని అన్ని ఖనిజ సంపదలను రాష్ట్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. సింగరేణిపై కేంద్రం పెత్తనం కొనసాగడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్ (ఎండీఓ) విధానాన్ని రద్దు చేసి, గనుల నిర్వహణను పూర్తిగా సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వనరులను ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తూ, సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్యమం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News