Trending Now

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ.. అదనంగా లాభాలను అర్జించాలి..

జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషా

ప్రతిపక్షం, జగిత్యాల, ఏప్రిల్ 24: రైతులను సంఘటితం చేసి లాభసాటి వ్యవసాయాన్ని అందించడమే అల్లీపూర్ రైతు మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషా అన్నారు. బుధవారం రాయికల్ మండలం లోని అల్లిపూర్ గ్రామంలో “అల్లీ పూర్ రైతు మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడూతూ.. అల్లిపూర్ రైతు మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గత సంవత్సరం నాబార్డ్ చేత శాంక్షన్ చేయబడిందని తెలిపారు. ఈ సంవత్సరం మార్చి నెలలో రిజిస్టర్ కావడం జరిగిందని, ఈ కంపెనీలో దాదాపు 300 మంది 50 ఫార్మర్స్ అయ్యారని, అలాగే దాదాపు రూ. 5 లక్షల వరకు షేర్ క్యాపిటల్ కూడా కలెక్ట్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఈ కంపెనీ దాదాపు అల్లిపూర్ చుట్టు పక్కల 6 గ్రామాలకు కవర్ చేస్తుందని, అలాగే ఈ కంపెనీలో ముఖ్యమైన పంటలు వరి, మామిడి, పసుపు కొన్ని రకాల వెజిటేబుల్స్, ఈ ఎఫ్.పి.సి. ఎల్ కి నాబార్డ్ దఫాలుగా రూ. 43 లక్షలు మూడు నుంచి ఐదు సంవత్సరాలు కాలంలో గ్రాంట్ చెల్లించడం జరుగుతుందని అన్నారు.

ఈ ఎఫ్ఓకి ఒక సీఈఓ,అకౌంటెంట్ ఉండడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే బిజినెస్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుందని, దీని యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు.రైతులను సంఘటితం చేసి రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. మేడిపల్లి, రాయికల్,జగిత్యాల రూరల్ మండలంలో ఒక్కొక్క మండలానికి ఒకటి చొప్పున 350 మనకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సభ్యులు రెగ్యులర్ గా చేసే రీతిలో వ్యవసాయం కాకుండా సృజనాత్మకంగా విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ లేటెస్ట్ టెక్నాలజీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ అదనంగా లాభాలను అర్జించాలని సూచించారు.

రైతులందరూ కూడా సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, వైవిధ్యభరిత పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక రైతు తన అవసరాలకు సంబంధించిన అన్ని రకాల ధాన్యాలని కూరగాయలను గాని తనే తన పొలంలో పండించుకునేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఉత్పత్తిదారుల సంఘం లో ఉన్న సభ్యులను వివిధ ప్రదేశాల్లో అభ్యుదయ రైతులు పండిస్తున్న వివిధ రకాల పద్ధతులను గమనించేలా క్షేత్రస్థాయి ప్రదర్శనలకు ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షులను కోరడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ అధికారులను, బ్యాంకు వారిని, శాస్త్రవేత్తలను ఈ సభ్యులకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిందిగా సూచించారు. రైతులు సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయం వైపు కూడా చూస్తూ మన నేలను, ఆరోగ్యాలను రక్షించుకోవాలని, ముందు తరానికి ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.పీ.ఓ అధ్యక్షుడు శంకర్, మనకు లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట్ రెడ్డి,నాబార్డ్ మనోహర్ రెడ్డి, డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాణి, అగ్రికల్చర్ స్టేషన్ పొలాస సైంటిస్ట్ రజనీ దేవి, లోకల్ బ్రాంచ్ టీజీబీ బ్యాంకు మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News