ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 24 : మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారని ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుండి సుమారు వందకు పైగా వాహానాలతో అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ల కార్యక్రమం భారీ సభ, ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల మోడీ పాలన సుస్థిరపాలనంగా గుర్తించిన ప్రజలు ఆయనను తిరిగి మూడోసారి కూడా ప్రధానిగా చూసేందుకు ఆశతో ఉన్నారన్నారు.. ‘సబ్కా సాత్ సాబ్ కాం వికాస్’.. నినాదంతో వినూత్నమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో నరేంద్ర మోడీ పదేళ్ల పాలన కొనసాగిందని తెలిపారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ లతోపాటు పలువురు ఆయా విభాగాల బీజేపీ పదాధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.