Trending Now

తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒకరోజు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని.. మధ్యాహ్న భోజనం తర్వాతే పిల్లలను ఇంటికి పంపించాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు ఏప్రిల్ 23ని చివరి పని దినంగా విద్యాశాఖ నిర్ణయించింది.

Spread the love