Nagarjuna praises the movie ‘Satyam Sundaram’: ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తమిళ్ హీరో కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై కింగ్ నాగార్జున తాజాగా ప్రశంసలు కురిపించారు. ‘డియర్ బ్రదర్ కార్తి.. నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా చూశా. నువ్వు, అరవింద్ స్వామి అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాలో నిన్ను చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నా. అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, ముఖ్యంగా ‘ఊపిరి’ రోజులు గుర్తుకువచ్చాయి. మనసుని హత్తుకునే చిత్రాలను సినీప్రియులు, విమర్శకులు మెచ్చుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.