Trending Now

మోదీ గ్యారెంటీయే నిజమైన గ్యారెంటీ..

ఆదిలాబాద్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్‌, లూఠ్‌ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని ఆయన మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని తొలుత మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని.. ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ కుంభకోణం చేస్తే ఆ స్కామ్‌ ఫైళ్లను కాంగ్రెస్‌ తొక్కి పట్టింది. మీరు తిన్నారు. మేమూ తింటాం అని కాంగ్రెస్‌ అంటోంది. మోదీ గ్యారెంటీపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని స్పష్టం చేశారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతోంది. తెలంగాణప్రజల మద్య ఈ ఉత్సవం జరుపుకోవడానికి నేను ఇక్కడికి వచ్చా. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ఉత్సవం చేస్తోంది.

Spread the love