ప్రతిపక్షం, దుబ్బాక, ఏప్రిల్ 12: వాహనాల తనిఖీల్లో భాగంగా దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎస్ఐ గంగరాజు పోలీస్ సిబ్బంది తో శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా 83 వేలు పట్టుబడ్డాయి. లచ్చపేటకు గ్రామానికి చెందిన జమల్ పూర్ (Ts 36T9307)వాహనంలో తన వెంట ఎలాంటి సరైన పత్రాలు లేకుండా రూ. 83,000/- రూపాయలను తీసుకువెళ్ళుతున్నవ్యకి దగ్గరి నుండి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున నగదును స్వాధీనం చేసుకున్నారు.