Trending Now

బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే దేశంలో తిరుగుబాటు తప్పదు

బీసీల హెచ్చరిక..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన భారతదేశంలో పేద – ధనిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఇవాళ బీసీ భవన్ లో జరిగిన 16 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాజ్యాంగ పీఠికలో సెక్యూలర్ – సామ్యవాదమని పేర్కొన్న ఇప్పటికీ వ్యత్యాసాలు తగ్గడం లేదు. పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నారు. ఒక 100 మంది కార్పొరేటర్లు లక్షల కోట్లకు అధిపతులయ్యారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సామాజిక వివక్ష రూపమాపలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

భారతీయులంతా బీసీ కులాల వారే అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం ఇందులో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వారి వారి వాటా వారికి ఇవ్వాల్సినదే లేనిపక్షంలో దేశంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఒక్క బీసీ కులానికి చెందిన వారై ఉంది కూడా బీసీల అభివృద్ధికి ఒక చిన్న డిమాండ్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనక పోవడం దేశంలోని 70 కోట్ల మంది బీసీలు జీర్ణించుకోలేక పోయారని విమర్శించారు. 76 సంవత్సరాల తర్వాత దేశంలో 70 కోట్ల మంది బీసీ ప్రజల వాటా బీసీలకు ఇవ్వరా? ఇది ప్రజాస్వామ్య దేశం – బీసీలు బిచ్చగాళ్లు కాదు వాటాదారులు వాటా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు. ఇదేమి న్యాయం. భరతమాత ముద్దుబిడ్డలం అందరికీ సమన్యాయం పాటించాలని కోరారు. బీసీలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎన్ని రోజులు సెంటిమెంటుతో బీసీలను మోసం చేసే చర్యలకు పాల్పడరాదని, మెజార్టీ ప్రజలైన బీసీలను అభివృద్ధి చేస్తేనే భారతదేశం అగ్ర దేశంగా రూపుదిద్దుతుందని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆర్.కృష్ణయ్య కోరారు.

రాజకీయ రంగంలో బీసీ ల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వార తెలిసింది. కేంద్రమంత్రి వర్గంలో, రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్ల లో 75 సంవత్సరాల బీసీ ల ప్రాతినిధ్యం సర్వే చేసి లెక్కించగా.. 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. డబ్బుల ప్రభావం ఎన్నికల మీద విపరీతంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో డబ్బులు లేని బీసీ లు ఎన్నికలలో గెలవలేరు. 56 శాతం జనాభా గల బీసీ లకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం, పారిశ్రామిక రంగంలో 1 శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిథ్యం లేదంటే చట్ట సభలలో బీసీ లకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది. 2021-22 లో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బీసీ జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సుప్రీం కోడ్డు- హై కోర్టు బీసీ జనాభా లెక్కలు సేకరించాలని 40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర పురుత్వం బీసీ జనాభా లెక్కలు తీయకుండా అన్యాయం చేస్తుందని విమర్శించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అణచి వేయడానికి చూస్తున్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారుపంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బీసీల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని కోరారు.

ఎస్సీ /ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బిబీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకురావాలని కోరారు. అందుకే ఎస్సీ/ఎస్టీ /బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్రంలో బీసీలకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బీసీ కులాల వారిగా లెక్కలు సేకరించాలని ఆయన కోరారు. ఈ డిమాండ్‌లపై జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టాలని ఆర్. కృష్ణయ్య నిర్ణయించారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, ఓయూ జే‌ఏసీయూ నేత ఏనుగంటి రాజు నేత, అనంతయ్య, అంజి, పి. సుధాకర్, దొడ్డిపల్లి రఘుపతి, మధు, మహేష్, రాహుల్, చైతన్య, రాము, విక్రం, జగన్, తేజ, మనోహర్, చానుక్య, రమేశ్, సాయి, గణేశ్, అశోక్, బాల స్వామి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News