Anura Dissanyaka declared Sri Lanka’s next president: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఏర్పడింది. రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టగా.. మార్క్సిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి నాయకుడు సాజిత్ ప్రేమదాస 32.76 శాతం గెలుచుకొని రెండో స్థానంలో ఉండరెండోసారి అధికారాన్ని చేపట్టాలని ఆశిస్తోన్న ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు 17 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31 శాతం ఓట్లు అనుర కుమార సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాగా, శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ వెల్లడించింది.