US Presidential election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారీస్ నిల్చున్నారు. ఈ ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే కమలా హారిస్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఈ క్రమంలోనే ట్రంప్‌పై కమలా హారీస్ పైచేయి సాధిస్తున్నారు. ఆగస్టులో ట్రంప్ కంటే ఎక్కువగా విరాళాలు సేకరించి రికార్డు నెలకొల్పారు. కమలా హారీస్ ఆగస్టులో 30లక్షలమంది దాతల నుంచి 36.1కోట్ల డాలర్లు విరాళాలు సేకరించగా..ట్రంప్ మాత్రం కేవలం 13 కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. దీంతో ట్రంప్ వెనుకంజలో ఉన్నారు. ఇక, సెప్టెంబర్ లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఎంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాల నిర్వహణకు హారీస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది.