ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్(APHD)తో బాధపడుతున్నట్లు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం ఫహాద్ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆవేశం’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.