Trending Now

న్యాయ వాదుల పరిరక్షణ చట్టం రూపొందిచాలి..

న్యాయవాది వెంకట్ మహేంద్రపై దాడిని ఖండించిన న్యాయవాదులు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వాదుల పరిరక్షణ, భద్రత చట్టం తీసుకోరావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాది వెంకట్ మహేంద్రపై భౌతిక దాడి చేసి హత్య ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోమవారం పట్టణ కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ.. కేసులల్లో వారికి వ్యతిరేక కక్షిధారుల తరపున వాదిస్తున్నామన్నారు. ఈ నెపంతోనే భౌతిక దాడులకు పాల్పడి వ్యక్తి గత దూషణలు చేస్తే సహించేది లేదన్నారు. తాము వృత్తి ధర్మంలో భాగంగా మాత్రమే కేసులు వాదించి గెలవాలని తపనతో ఉంటామని నిజానికి ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలుండవన్నది సమాజం గుర్తించకుండా దాడులకు దిగడం సరికాదన్నారు.

న్యాయవాదులు సైతం ప్రతిదాడులు చేయగల సామర్థ్యం ఉన్న తామూ బాధ్యత గల న్యాయవాద వృత్తిలో ఉన్నామన్న స్పృహతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విలువనిస్తామన్నారు. క్షణికావేషంలో వ్యక్తిగత దాడులకు, దూషణలకు పాల్పడుతూ.. జీవిత భవిష్యత్తు పాడుచేసుకోవద్దని హితవు పలికారు. న్యాయ వాదులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయ వాదుల పరిరక్షణ చట్టం రూపొందిచాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీస్ లు వెంటనే స్పందించి కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనగా సోమవారం విధులు బహిష్కరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నిర్మల్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Spread the love

Related News