Trending Now

గురుకుల పాఠశాలల పట్ల వివక్ష.. బీఆర్‌ఎస్ నేత

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేకుంటున్నారని.. విద్యా శాఖపై సమీక్షలు చేయడం లేదని ఫైరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యార్థుల బలిదానాలు జరిగాయని ఆరోపించారు.

సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఫీజులు భారీగా పెంచారని పేర్కొన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడిన వాళ్లంతా కనుమరుగు అయ్యారని.. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం వెంకట్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు క్రెడిబిలిటీ లేదని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయమని స్పష్టంచేశారు.

Spread the love

Related News