Trending Now

కాంగ్రెస్‌ సర్కారుతో ఆగమైపోతున్న రైతులు : మాజీ మంత్రి కేటీఆర్‌

ప్రతిపక్షం, సిరిసిల్ల: కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను కేటీఆర్‌ పరిశీలించారు. పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల్లో భరోసా నిపండానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు.

డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని, ఇప్పటిరకు చేయలేదని విమర్శించారు. రైతుబంధుకు కేసీఆర్‌ సర్కార్‌ రూ.7 వేల కోట్లు సిద్ధంచేసిందని, కానీ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పంటసాయాన్ని ఆపిందని చెప్పారు. తాము రైతుల కోసం ఉంచిన డబ్బులను కాంగ్రెస్‌ పార్టీ కాంట్రాక్టర్లకు ఇచ్చిందన్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, చివరికి వారిని కూడా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను రిపేర్‌ చేయడానికి రేవంత్‌ రెడ్డికి చేతకావడం లేదని విమర్శించారు.

Spread the love