Trending Now

సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ వరల్డ్​ రికార్డ్.. మహిళల క్రికెట్​లో ఫాస్టెస్ట్​ బంతి

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ అరుదైన రికార్డు నెలకొల్పారు. మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ బంతిని సంధించిన బౌలర్‌గా నిలిచారు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024లో గంటకు 132.1 కిమీల వేగంతో బంతిని విసిరారు. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షబ్నిమ్‌.. ఈ ఫీట్‌ సాధించారు. 130 కిమీలకి మించిన వేగంతో బౌలింగ్‌ చేయడం మహిళా క్రికెట్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం.

2016లో వెస్టిండీస్‌పై 128 కిమీల వేగంతో షబ్నిమ్‌ బంతిని విసిరారు. 2022 మహిళల ప్రపంచకప్‌ సమయంలో రెండుసార్లు 127 కిమీ వేగాన్ని నమోదు చేశారు. గత ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 16 ఏళ్ల కెరీర్‌లో సౌతాఫ్రికా తరఫున 8 టీ20 ప్రపంచకప్‌లలో ఆడారు. సౌతాఫ్రికా తరఫున 1 టెస్ట్, 127 వన్డేలు, 113 టీ20లు ఆడిన షబ్నిమ్‌.. 317 వికెట్లు పడగొట్టారు.

Spread the love