Trending Now

పలువురికి మంత్రి అల్లోల పరామర్శ..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఉదయం నిర్మల్ మండలంలోని మేడిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించారు. నిర్మల్ మాజీ ఎంపీపీ అల్లోల సుమతి గోవర్ధన్ రెడ్డి తండ్రిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా సీనియర్ నాయకులు చిన్న రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా.. ఆయనను పరామర్శించారు. అలాగే కొండాపూర్‌లో తుడిగేని చరణ్ మృతిచెందగా ఆయనను కూడా పరామర్శించారు. అల్లోల వెంట అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, రత్నాపూర్ కాండ్లీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పాకాల రామచందర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News