Trending Now

మంత్రి సీతక్కనుకలిసిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

నిర్మల్. ( ప్రతిపక్షం ప్రతినిధి) ఏప్రిల్, 14 : భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిసిసి అధ్యక్షులు కే శ్రీహరి రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వారితో సుమారు గంట పాటు పలు విషయాలు చర్చించారు ఆమెతోపాటు డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడపుచిన్ను , పిండి శ్రీనివాస్ మనోజ్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. దీంతో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు ఇక కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారనే ప్రగఢ విశ్వాసం స్థానికులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉంది.

Spread the love

Related News