ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్‌లో దుమ్ములేపుతోంది. కల్కీ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 191.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. భారత్‌లో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.