ప్రతిపక్షం, జూన్ 15: హైదరాబాద్లోని ఫిలింనగర్ ప్రాంతానికి చెందిన ఓ వివాహితను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన డేగరాజు (25) అనే యువకుడు ఫోన్ కాల్స్, అసభ్యకర సందేశాల ద్వారా మహిళను నిరంతరం వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, దారిపొడవునా అడ్డగించి వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది.
నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

















