ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: చందానాయక్ తండా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో గాంబ్లింగ్ ఆడుతున్న 9 మందిని SOT మాదాపూర్ టీమ్ & మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన ఆర్గనైజర్ ముద్దాల వెంకట కృష్ణారావు (52), పబ్బా రవీందర్, వీరపాణి నర్సింహారావు, సుంకర రవిశంకర్, దాకర రామారావు, ఆర్. సత్యరాజు, సింహాద్రి శ్రీనివాస్, గద్దల దిలీప్ కుమార్, బాసబోయిన రంజిత్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.2,71,500/ నగదుతో పాటుగా 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.