Trending Now

షణ్ముక్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

ప్రతిపక్షం, తెలంగాణ: డ్రగ్స్‌ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తనపై షణ్ముఖ్ వాళ్ళ అన్న సంపత్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని.. బలవంతంగా అబార్షన్ కూడా చేయించినట్లు మౌనిక పోలీసులకు తెలిపింది. యూట్యూబ్‌లో అవకాశాలు ఇస్తానని చెప్పి.. షణ్ముక్‌ మోసం చేశాడని పోలీసులకు మౌనిక చెప్పింది. షణ్ముక్‌తోనే అతని అన్న సంపత్‌ పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముక్‌ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఓసారి తనకు అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. సంపత్ వినయ్, తనకు మూడేళ్ల కిందటే ఎంగేజ్మెంట్‌ జరిగిందని.. రెండు కుటుంబాలు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాయని పేర్కొంది. వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడని తెలిసి.. పోలీసులను తీసుకుని సంపత్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు పేర్కొంది.

Spread the love