[t4b-ticker]

సిద్దిపేట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రతిపక్షం,సిద్దిపేట టౌన్,ఆగష్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సిద్దిపేట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా పట్టణ రజక సంఘం అధ్యక్షుడు లింగస్వామి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రజకుల సంక్షేమం, సంఘం అభివృద్ధి, ఐక్యత కోసం సంఘం ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తామని లింగస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి కనకరాజు, ఉపాధ్యక్షడు చెవిటి శ్యామ్ కుమార్,భూంపల్లి రాజలింగం,సభ్యులు అల్లిపురం మల్లికార్జున్,భూంపల్లిచందు,భువనగిరి శ్రీనివాస్,కోడూరిమహేష్, భూంపల్లి మహేష్,భూంపల్లి శ్రీనివాస్,భూంపల్లి వైకుంఠం,కోడూరి మల్లికార్జున్, అంతగిరి పోచయ్య,నారాయణరావు పేట నరేష్,చెవిటి బుగ్గరాజు,చెవిటి సంతోష్, అంతగిరి వెంకటేశం సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News